అందాల పోటీల వల్ల జాబ్స్ వస్తాయి
NEWS Mar 20,2025 05:14 pm
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఆదాయం పెరుగుతుందని, దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ పోటీలకు సంబంధించి 140 దేశాల నుంచి ఇక్కడికి వస్తారని, ప్రపంచ దృష్టి మన రాష్ట్రంపై పడుతుందన్నారు జూపల్లి. అందాల పోటీలను ఇంకో కోణంలో చూడవద్దని సూచించారు. ఇది ఎంతో మంది అమ్మాయిలు, మహిళలకు మనో ధైర్యం, సంకల్పం కలుగుతుందని చిలుక పలుకులు పలికారు.