డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగను ప్రశంసించారు. అణగారిన మాదిగలకు గొప్ప గుర్తింపును, ఆత్మ గౌరవం కలిగించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన జాతి కోసం చేసిన ప్రయత్నం స్పూర్తి దాయకమన్నారు. వర్గీకరణ అంశం గురించి దేశ స్థాయిలో చర్చ జరిగేలా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. వీరిద్దరినీ తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ అంశంలో ఎవరూ ఇబ్బంది పడకుండా తీసుకు వచ్చిన ఈ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.