దళితుడిని స్పీకర్ చేసిన ఘనత నాదే
NEWS Mar 20,2025 04:01 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి లోక్ సభలో స్పీకర్ గా దళితుడిని చేసిన ఘనత తనదేనని అన్నారు. గోదావరి జిల్లాకు చెందిన బాలయోగికి ఛాన్స్ ఇచ్చానని చెప్పారు అసెంబ్లీలో. అంతే కాకుండా ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రతిభా భారతిని శాసన సభ సభాపతిని చేశానని పేర్కొన్నారు. అంతే కాకుండా కేఆర్ నారాయణన్, ఏపీజే అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతులుగా చేసిన ప్రభుత్వాల్లో టీడీపీ భాగస్వామ్యంగా ఉండటం గర్వంగా ఉందన్నారు. అంతే కాకుండా సీనియర్ ఐఏఎస్ కాకి మాధవరావును సీఎస్ చేశానన్నారు.