డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం
NEWS Mar 20,2025 03:41 pm
డ్రగ్స్ మహమ్మారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా హోం మంత్రి అనిత సారధ్యంలో ఈగల్ టీం ఈ విషయంలో చెండాడుతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గత ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణను పూర్తిగా విస్మరించిందన్నారు. విజయవాడలో సమీరా ఫిలిమ్స్ నిర్మించిన డార్క్ డీల్స్ చిత్రం ట్రైలర్ ను ఆవిష్కరించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడంతో యువత చెడు మార్గం పట్టిందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో డ్రగ్స్ పై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఆ ఆనవాళ్లు కనిపించినా వెంటనే ఈగల్ టీం అక్కడికి వాలిపోతోందని, చర్యలు తీసుకుంటుందన్నారు.