బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ..నటులపై కేసు
NEWS Mar 20,2025 01:05 pm
హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే 11 మంది యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారని. తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కీలక నటులుగా ఉన్న వారికి కూడా బిగ్ షాక్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ను కావాలని ప్రమోట్ చేశారంటూ సినీ రంగానికి చెందిన రానా దగ్గుబాటి, విజయ్ దేవర కొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు.