ఆలయాల అభివృద్దిపై ఫోకస్
NEWS Mar 20,2025 09:49 am
ఆలయాల అభివృద్దిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ సర్కార్ ఆలయాల గురించి పట్టించు కోలేదని ఆరోపించారు. కేవలం యాదగిరిగుట్ట టెంపుల్ పైనే ఫోకస్ పెట్టారని అన్నారు. కావాల్సినన్ని నిధులు కేటాయించక పోవడం వల్ల అవి అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయని వాపోయారు. దీనిపై తాము వచ్చాక ఫోకస్ పెట్టామన్నారు. వేములవాడ, కొండగట్టు, బాసర , భద్రాచలం ఆలయాల పై ప్రకటనలు వచ్చాయి కానీ నిధులు రాలేదన్నారు. సీఎంతో కలిసి వేములవాడ సందర్శించాం. నిత్యాన్నదానం సత్రంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు పొన్నం.