సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం ఆయన దళితుల గురించి మాట్లాడారు. దళితులకు తాను వచ్చాకనే న్యాయం జరిగిందన్నారు. ఎవరూ ఇంత వరకు ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పిందే తప్పా ఆచరణలో చర్యలు చేపట్టిన పాపాన పోలేదన్నారు సీఎం. ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. నేను కాకపోతే ఇంకెవరూ న్యాయం చేయరని బలంగా నమ్మానని చెప్పారు. ఎవరు ఏమన్నా అనుకోనీ, తిట్టుకున్నా పర్వా లేదని తాను ముందుకు వెళ్లానని అన్నారు.