తాగుబోతులకు 2 బాటిళ్లు ఫ్రీగా ఇవ్వండి
NEWS Mar 20,2025 08:59 am
జేడీఎస్ ఎమ్మెల్యే క్రిష్ణప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీలో ఆయన మందుబాబులను ఉద్దేశించి వారానికి రెండు మద్యం బాటిళ్లను ఉచితంగా ఇవ్వాలని కోరారు. మహిళలకు నెలకు రూ. 2000, ఉచితంగా విద్యుత్ తో పాటు అన్నీ ఫ్రీగా ఇస్తున్నారని, కానీ మందు బాబులు ఏం పాపం చేశారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏటా రూ.40 వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న వాళ్లకు మందు బాటిళ్లు ఫ్రీగా ఇస్తే తప్పేంటని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో తాగుబోతులంతా ఎమ్మెల్యే క్రిష్ణప్పకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు.