600 మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
NEWS Mar 20,2025 08:31 am
మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం ఉపాధి కల్పన కల్పించేందుకు హన్మకొండ పట్టణానికి చెందిన 10 డివిజన్లకు చెందిర 600 మంది మహిళలకు పోచంపల్లి ఫౌండేషన్ , ఏపీఎల్ హెల్త్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు. ఉచితంగా కుట్లు, అల్లికలపై శిక్షణ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.