హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన ఆయన ఉన్నట్టుండి కంపెనీలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు తమకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇచ్చే నిధులతో చెరువులను అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఆయా కార్పొరేట్ కంపెనీలు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారంతా సహకరించాలని కోరారు కమిషనర్. ఇప్పటి వరకు స్వచ్ఛంధ సంస్థలకు ఇస్తూ వచ్చిన కంపెనీలు ఉన్నట్టుండి హైడ్రాకు ఇవ్వాల్సి ఉంటుంది.