ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
NEWS Mar 19,2025 10:20 pm
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని సూచించారు. కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా గ్రామాలలో సీసీ టీవీలపై అవగాహన కల్పించాలని కోరారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వాటి వినియోగంపై, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.