క్రేన్ వక్కపొడి సంస్థలపై ఐటీ రైడ్స్
NEWS Mar 19,2025 07:52 pm
క్రేన్ వక్కపొడి సంస్థలకు కోలుకోలేని షాక్ తగిలింది. సంస్థ చైర్మన్ కాంతారావు నివాసంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని క్రేన్ వక్కపొడి హెడ్ ఆఫీసులు, గోదాములు, ఇతర ఇళ్లల్లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) సోదాలు చేపట్టింది. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లలో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.