నవ తరానికి అన్నమాచార్య కీర్తనలు అందించాలి
NEWS Mar 19,2025 04:48 pm
నవతరానికి అనువుగా ఉండేలా జన బాహుళ్యంలోకి మరింతగా తాళ్ళపాక అన్నమాచార్యులు కీర్తలను తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో జె. శ్యామల రావు ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మను ఆదేశించారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆద్వర్యంలో టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు బెంగళూరు , చెన్నైకి చెందిన గాయకులు, సంగీత దర్శకులతో సమావేశం జరిగింది. అన్నమాచార్యులు 32 వేలకు పైగా కీర్తనలు ఆలాపించారని, వాటిలో ఇప్పటి వరకు టీటీడీ 14,932 కీర్తనలను టీటీడీ అందుబాటులోకి తీసుకు వచ్చిందన్నారు.