హెల్మెట్ ధరించక పోతే రూ.1000 జరిమానా
NEWS Mar 19,2025 04:23 pm
ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. అసెంబ్లీ లో హెల్మెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హెల్మెట్ ధరించక పోవడం కారణంగా ఎంతో మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చారని వాపోయారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని హెచ్చరించారు. తమ ప్రభుత్వం హెల్మెట్ ధరించడానికి సంబంధించి సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.