డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం
NEWS Mar 19,2025 01:52 pm
రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై ఉక్కు పాదం మోపుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. హోం శాఖకు రూ. 10,188 కోట్లు కేటాయించామన్నారు. డ్రగ్స్ ను నియంత్రించేందుకు మిత్ర యాప్ తీసుకు వస్తామన్నారు. ఇది హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రమంతటా విస్తరిస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాల నేరాల్లో ఎంతటి వారున్నా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఐటీ కేంద్రంగా వరంగల్ ను తీర్చి దిద్దుతామని ప్రకటించారు. విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా మారుస్తామన్నారు. నిజామాబాద్, ఖమ్మంను వ్యవసాయాధారిత పరిశ్రమలు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చి దిద్దుతామన్నారు.