వైసీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్ రాజీనామా
NEWS Mar 19,2025 12:20 pm
వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్ రెడ్డికి పంపించారు. ఇదిలా ఉండగా పార్టీ అధికారానికి దూరం కావడంతో పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో నలుగురు గుడ్ బై చెప్పారు. వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. వీరితో పాటు రాజశేఖర్ కూడా చేరారు. దీంతో శాసన మండలిలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలను కోల్పోయింది వైసీపీ.