బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఈడీ ఆరా
NEWS Mar 19,2025 10:41 am
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కలకలం రేపింది. ఈ తరుణంలో ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆరా తీసింది. మొత్తం ఎవరెవరు ప్రమోషన్స్ చేశారనే దానిపై కూపీ లాగింది. యూట్యూబర్స్ వివరాలను సేకరించింది. వారి సంపాదనపై కూడా ఈడీ ఫోకస్ చేసినట్లు సమాచారం.