బడ్జెట్ ప్రవేశ పెట్టిన భట్టి విక్రమార్క
NEWS Mar 19,2025 10:10 am
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2025-26 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అంతకు ముందు శాసన సభ కమిటీ హాల్ లో మంత్రివర్గం సమావేశమైంది. బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. రూ 3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండగా శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.