జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు
NEWS Mar 19,2025 09:58 am
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐఏ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. సీనియర్ టీం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద చొరబాటు కేసుకు సంబంధించి బుధవారం జమ్మూ అంతటా అనేక ప్రదేశాలలో సోదాలు చేపట్టడం జరిగిందని ఎన్ఏఐ చీఫ్ వెల్లడించారు. దర్యాప్తు సంస్థ అధికారుల ప్రకారం నిషేధిత సంస్థలైన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) , జైషే-ఏ-మొహమ్మద్ (JeM) లకు చెందిన క్రియాశీల ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) ద్వారా భారతదేశంలోకి చొరబడ్డారనే సమాచారం అందింది.