సునీతా విలియమ్స్ కు మోదీ లేఖ
NEWS Mar 18,2025 05:56 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. భారత్ కు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ ఇండియాకు రావాలని కోరారు. మీరు 143 కోట్ల భారతీయుల గుండెల్లో నిక్షిప్తమై ఉన్నారని, మిమ్మల్ని తాను సాదరంగా ఆహ్వానిస్తున్నానని స్పష్టం చేశారు. గత 9 నెలలుగా రోదసీలోనే గడిపారు సునీతా విలియమ్స్. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్ధరాత్రి 3.27 గంటలకు భూమి మీదకు రానుంది. ఆమె రాక కోసం ఇటు భారతీయులు, అటు అమెరికన్లు వేచి చూస్తున్నారు.