ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
NEWS Mar 18,2025 05:49 pm
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ పై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఎస్సీ.