ఇందిరమ్మ ఇండ్లలో మాదిగలకు ప్రాధాన్యత
NEWS Mar 18,2025 05:46 pm
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అమరులైన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడి, అసువులు బాసిన కుటుంబాలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతే కాకుండా తాజాగా తమ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకంలో కూడా తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.