భారత్ అమెరికా మధ్య బంధం బలోపేతం
NEWS Mar 18,2025 03:10 pm
అమెరికా దేశ లా మేకర్, ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బర్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్య మరింత బంధం బలోపేతం అవుతుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం కావడం జరిగిందన్నారు. ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా సత్ సంబధాలు ఉన్నాయని చెప్పారు. భారత్ కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఇంకొన్ని అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. సంబంధాలు ఆసక్తికరంగా ఉండనున్నాయని పేర్కొన్నారు. మోడీ, ట్రంప్ ఇద్దరూ గొప్ప దూరదృష్టి కలిగిన నేతలు అంటూ కితాబు ఇచ్చారు.