శాసన మండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
NEWS Mar 18,2025 02:51 pm
శాసన మండలిలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేరు వేరు బిల్లులు తీసుకు వచ్చారు. రిజర్వేషన్లు పెంపు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఎంఐఎం మద్దతు ఇచ్చాయని చెప్పారు. తమిళనాడును ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళదామన్నారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చని, అందరం కలిసి కేంద్రాన్ని కోరుదామన్నారు. దేశానికి ఈ బిల్లు రోల్ మోడల్ గా ఉంటుందన్నారు.