బాంబే హైకోర్టులో రవి ప్రకాష్ కు షాక్
NEWS Mar 18,2025 02:24 pm
మేఘా ఇంజినీరింగ్ సంస్థపై టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది ముంబై హైకోర్టు. మేఘా సంస్థ బోరెవెళ్లి ప్రాజెక్టులో బ్యాంకు గ్యారంటీ ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ (పిల్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రవి ప్రకాష్ దాఖలు చేసిన పిల్‌ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో మేఘా ఇంజినీరింగ్ తరపున ముకుల్ రోహత్గీ, డేరియస్ ఖంబాటా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ తరపున తుషార్ మెహతా, రవి ప్రకాష్ తరపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.