అక్రమ ఇసుక రవాణ చేస్తున్న లారీ, ట్రాక్టర్ పట్టివేత
NEWS Mar 18,2025 01:01 pm
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న లారీ, ట్రాక్టర్ ను పోలీస్, రెవెన్యూ సిబ్బంది కలిసి పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద లారీని, జగ్గాసాగర్ శివారులో ట్రాక్టర్ ను పట్టుకొని తదుపరి చర్య నిమిత్తం పోలీస్ స్టేషన్ లో అప్పగించగా ఎస్సై కిరణ్ కుమార్ లారీ, ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.