వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
NEWS Mar 18,2025 09:50 am
ఏపీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ తీర్మానం చేసింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తున్నట్లు వెల్లడించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ లో కూడా ఇందుకు సంబంధించి వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. ఇక నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా గతంలో ఏపీలో ఉన్న జగన్ రెడ్డి సర్కార్ కడప పేరు తీసేసి వైఎస్ఆర్ జిల్లాగా పెట్టింది.