8 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ఎంపిక
NEWS Mar 18,2025 09:40 am
బీజేపీ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు పార్టీ పరంగా అధ్యక్షులను ప్రకటించారు పార్టీ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. రంగారెడ్డి అర్బన్ జిల్లాకు శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి రూరల్ కు రాజ్ భూపాల్ గౌడ్, వికారాబాద్ జిల్లాకు రాజశేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ కు నరేందర్ రావు, గద్వాల జిల్లాకు రామాంజనేయులు, ఖమ్మం జిల్లాకు కోటేశ్వర రావు, భద్రాద్రి జిల్లాకు నిరంజన్ యాదవ్ లను నియమించారు. కాగా మేడ్చల్ అర్బన్ , కరీంనగర్ జిల్లాల అధ్యక్షుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు. 38 జిల్లాలకు గాను 36 జిల్లాలకు చీఫ్ లను నియమించారు.