ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా భాషల అమలుపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంటోంది. ఈ తరుణంలో భాషకు సంబంధించి కూటమికి చెందిన నేతలు, ప్రధానంగా టీడీపికి చెందిన వారు ఎవరూ కూడా నోరు విప్పవద్దని స్పష్టం చేశారు. దాని వల్ల అనవసర రాద్దాంతం చోటు చేసుకుంటుందన్నారు. అవగాహన ఉంటేనే తప్పా మాట్లాడాలి తప్పా లేకుండా మాట్లాడితే అభాసుపాలయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎవరూ కూడా పార్టీ లైన్ దాటవద్దని లేక పోతే చర్యలు తప్పవని చురకలు అంటించారు.