కాసులు గలగల భక్తుల కిటకిట
NEWS Mar 18,2025 08:19 am
కోరిన కోర్కెలు తీర్చే తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 70 వేల 824 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 674 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.84 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా పడుతుందన్నారు.