బెట్టింగ్ యాప్స్ కు బానిస కావద్దు
NEWS Mar 17,2025 07:18 pm
ప్రముఖ నటుడు సంపూర్ణేశ్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన యువతకు వీడియో సందేశం ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొందరు వీటి పట్ల ఆకర్షితులై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల బాగుపడిన వారు లేరన్నారు. వీటికి బానిస అయ్యే ముందు ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించాలని సూచించారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సంపూర్ణేశ్ బాబు.