యూనివర్శిటీ పేరు మార్పు దారుణం
NEWS Mar 17,2025 07:09 pm
ఏపీ బీజేపీ సీనియర్ నేత ఎస్. విష్ణు వర్దన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి అద్దం పట్టిందన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు భాష, సంస్కృతి, ఆత్మ గౌరవం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానీయుడని కొనియాడారు. అటువంటి గొప్ప త్యాగమూర్తి పేరు మీద ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడం తెలుగు భాషను, కోట్ల మంది తెలుగు వారి గౌరవాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు