తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఖుష్ కబర్
NEWS Mar 17,2025 06:58 pm
ఏపీ సర్కార్ ఎట్టకేలకు దిగి వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన సిఫార్సు లేఖలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి 24 నుంచి ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది.