శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్
NEWS Mar 17,2025 06:51 pm
తిరుమలను సందర్శించారు ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి. ఈ సందర్బంగా టీటీడీ పాలక మండలి సభ్యులు, ఈవో సాదర స్వాగతం పలికారు. అయ్యన్నపాత్రుడితో పాటు సతీమణి పద్మావతి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తుల మధ్య అన్నప్రసాదం స్వికరించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కృపా కటాక్షాలు సర్వ జనులకు లభించాలని ఆకాంక్షించారు. దేవస్థానం వృద్ధి, భక్తుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.