ఓయూ లో ఉద్రిక్తత..విద్యార్థుల అరెస్ట్
NEWS Mar 17,2025 06:21 pm
ఉస్మానియా యూనివర్శిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వెంటనే సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టాయి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల నిరసన చేపట్టాయి. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు.