సునీతా విలియమ్స్ వచ్చేస్తోంది!
NEWS Mar 17,2025 11:23 am
9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ కొన్ని గంటల్లో భూమిని చేరనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవుతారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్‌ను తీసుకొచ్చేందుకు ప్రయోగించిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ నిన్న విజయవంతంగా అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. నలుగురు వ్యోమగాములు ISSలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది.