బీజేపీ చీఫ్ అన్నామలై హౌస్ అరెస్ట్
NEWS Mar 17,2025 09:41 am
తమిళనాడులో బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ. 1000 కోట్లు ముట్టాయని ఆరోపించారు బీజేపీ చీఫ్ అన్నామలై. రూపీ సింబల్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉండగా తనను గృహ నిర్బంధం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.