శాంతి కోసం భారత్ ప్రయత్నం
NEWS Mar 17,2025 05:38 am
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా దేశాలతో భారత్ కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పుతిన్ , జెలెన్ స్కీకి యుద్దం మంచిది కాదన్నారు. ఈ విషయం వారిదరికీ తెలియ చేశానన్నారు. శాంతి కావాలని అనుకుంటే ఇరు దేశాల అధినేతలు తమ ఆధిపత్య ధోరణి విడనాడాలని సూచించారు. ఒకే టేబుల్‌పై కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని, దానిని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు మోదీ.