బూతులకు అంబాసిడర్ కేసీఆర్
NEWS Mar 17,2025 08:24 am
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు బూతు మాటలు నేర్పించిందే మాజీ సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. ఆయన బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి హరీశ్ రావుకు లేదన్నారు ఎమ్మెల్యే. మహిళలకు, రైతులకు, యువతకు పెద్దపీట వేసింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చిల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు.