సిఎం రేవంత్ కు కొండా థ్యాంక్స్
NEWS Mar 17,2025 08:21 am
వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులను మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. రూ. 600 కోట్లకు పైగా అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడంతో జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతోందన్నారు కొండా సురేఖ. ఇక్కడికి ఎయిర్ పోర్టు రావడానికి కృషి చేసినందుకు సీఎంకు రుణపడి ఉంటామన్నారు.