టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. యాడికిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన 1400 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆరోపించారు. వీటిని ఆక్రమించుకున్న వారు స్వామి వారికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జేసీ హెచ్చరించారు. దేవుడి భూములు ఆక్రమించుకున్న వారికి కష్టాలు తప్పవని పేర్కొన్నారు. విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.