ఏపీలో మార్చి 17 సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు కొనసాగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ వెల్లడించారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాకుండా ఎక్కడి నుంచైనా సరే పరీక్షా కేంద్రాల వద్దకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.