తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Mar 17,2025 07:23 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ అలివేలు మంగమ్మలను 82 వేల 721 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 261 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.46 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం స్వామి వారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.