ఉగాదికి జగ్గారెడ్డి సినిమా షూటింగ్ స్టార్ట్
NEWS Mar 16,2025 08:04 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి దాకా రాజకీయ రంగంలో ఉన్న తాను వెండితెర మీద కూడా ప్రతాపం చూపించ బోతున్నారు. ఈ మేరకు ఉగాది పర్వదినాన తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించారు. డైరెక్టర్ చూపించిన ఫోటో చూసి ఖచ్చితంగా సినిమా చేయాలని డిసైడ్ అయ్యానని అన్నారు జగ్గారెడ్డి. తన కథకు, పాలిటిక్స్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎలా అయ్యాననేది ఇందులో చూపిస్తామన్నారు. ఢిల్లీ టూర్ తనను మార్చేసిందని, దీని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదన్నారు. సంగారెడ్డి అభివృద్దిపై ఫోకస్ చేస్తూనే సినిమా చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వమే ఉండడంతో నిధులు ఎక్కువ తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.