మెట్ పల్లి మండలం పెద్దాపూర్ లో మల్లన్న స్వామి బోనాల జాతర కన్నులపండుగగా సాగింది. రాష్ట్రం లోని నలుమూలల నుండి భక్తులు గ్రామానికి చేరుకుని పరమాన్నం బండి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ మల్లన్న స్వామికి సుమారు 40 వేల నుండి 60 వేల వరకు భక్తులు బోనాలు సమర్పించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఒకే సారి వేలల్లో బోనాలు, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు, డప్పు చప్పుల్లు చూపరులను ఆకట్టుకున్నాయి.