సీఎం రేవంత్ ను కలిసిన వీసీ
NEWS Mar 16,2025 05:18 pm
సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు వైఎల్ శ్రీనివాస్. ఈ సందర్బంగా మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కలుసుకున్నారు. ఆయనకు శాలువా కప్పి సన్మానించారు. నూతన వీసీగా ఎంపికైన శ్రీనివాస్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం కావలాన్నా చేస్తామన్నారు. యూనివర్శిటీని దేశంలోనే నెంబర్ వన్ గా చేయాలని సూచించారు.