ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తే ఊరుకోం
NEWS Mar 16,2025 04:49 pm
ముస్లింల రిజర్వేషన్లను తొలగించడం ప్రధాని మోదీ తరం కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రోడ్టులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తమ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్ ను తొలగిస్తానంటూ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ షబ్బీర్ అలీ ఈ విధమైన కామెంట్స్ చేశారు. ముస్లీంల రిజర్వేషన్లను తొలగించడం సాధ్యం కాదన్నారు.