నాలుగేళ్ల చిన్నారి మిస్సింగ్ కలకలం
NEWS Mar 16,2025 04:54 pm
నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నాలుగేళ్ల చిన్నారి అదృశ్యమైందని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన మహేందర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య నలుగురు పిల్లలతో కలిసి నాందేడ్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. నాందేడ్ వెళ్లేందుకు దేవగిరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో ఎక్కిన మహేందర్ సింగ్ కొంత సేపటి తరువాత తన కూతురు సోనమ్ కౌర్ (4) లేదని గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేశారు.