నిజామాబాద్ లోని బైపాస్ రోడ్డు వద్ద కారు సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్ పై ఉన్న బాలుడు గాయపడ్డాడు. చంద్రశేఖర్ కాలనీకి చెందిన సయ్యద్ షాహిజాద్ (11) తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.