గత పదేళ్లలో కొలువుల భర్తీ ఎక్కడ..?
NEWS Mar 16,2025 01:51 pm
ఎమ్మెల్సీ కోదండరాం షాకింగ్ కామెంట్స్ చేశారు. శాసన మండలిలో జాబ్స్ భర్తీ విషయంపై తీవ్రంగా స్పందించారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో నిర్బంధ పాలన కొనసాగిందే తప్పా జాబ్స్ భర్తీ చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడం శుభ పరిణామమని అన్నారు. కేవలం మాయ మాటలతో నిరుద్యోగులను మోసం చేశారని వాపోయారు. దీంతో చాలా మంది ప్రతిభ కలిగిన యువత, నిరుద్యోగులు, అభ్యర్థులు తమ విలువైన కాలాన్నా కోల్పోవడం జరిగిందన్నారు. ఇవాళ విద్యా రంగం వ్యాపారంగా మారి పోయిందని పేర్కొన్నారు కోదండ రాం.